నాట్యం.. నేత్రానందం
వ్రతం.. భక్తి ఉత్సవం
వేములవాడ: పట్టణంలోని బద్దిపోచమ్మ ఆలయ పరిసరాల్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపైనే కార్లు, ఆటోలు, బైకులు నిలుపుతుండడం.. చిరువ్యాపారులు రోడ్లను ఆక్రమిస్తుండడంతో జనం నడిచేందుకు స్థలం కరువవుతుంది. శుక్రవారం అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు నడిచేందుకు సైతం ఖాళీ జాగ లేక ఇబ్బందిపడ్డారు.
తంగళ్లపల్లి: జిల్లెల్ల బీజేఆర్ వ్యవసాయ కళాశాలలో శుక్రవారం తెలంగాణ సంస్కృతి, జానపద వైభవం ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ ఎస్.ఉపేందర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల జానపద కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్లగొల్లపల్లిలో బాలత్రిపుర సుందరీదేవి ఆలయంలో శుక్రవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. 111 జంటలు వ్రతంలో పాల్గొన్నాయి. వ్రతం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.


