నేత్రపర్వం కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం కల్యాణోత్సవం

Nov 17 2026 12:26 AM | Updated on Nov 17 2026 12:26 AM

సిరిసిల్లటౌన్‌: శ్రీశాల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం దేవదేవుళ్ల కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీనివాసుడి తిరు కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవో పీసరి రవీందర్‌, అర్చక స్వాములు కృష్ణమాచారి, నవీన్‌చారి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. స్థానిక భూపతినగర్‌ విఠలేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ధ్వజ స్తంభం ప్రతిష్టాపనోత్సవం, చిన్నబోనాలలో రుక్మిణి వేణుగోపాలస్వామి ఆలయంలో కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ దంపతులు, వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, కౌన్సిలర్‌ బొల్గం వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement