బాలల సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాలల సమస్యల పరిష్కారానికి చర్యలు

Nov 17 2026 12:26 AM | Updated on Nov 17 2026 12:26 AM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ● బాలల కోసం ప్రత్యేక ప్రజావాణి ● సాధారణ ప్రజావాణికి 153 దరఖాస్తులు

సిరిసిల్ల అర్బన్‌: బాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో సోమవారం ప్రత్యేక బాలల ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు మర్రిపల్లి చందన హాజరయ్యారు. బాలల నుంచి అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుల పెన్షన్‌, అదనపు తరగతి గదులు, విద్యాలయంలో వసతులు, ఇందిరమ్మ ఇండ్లు, రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో ప్రవేశం కల్పించాలనే అంశాలపై దరఖాస్తులు రాగా.. వాటిని సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు. సాధారణ ప్రజావాణిలో 153 దరఖాస్తులు స్వీకరించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో 6, మండలాల్లో 46 దరఖాస్తులు వచ్చాయి.

పెన్షన్‌ ఇప్పించండి

మాది చందుర్తి మండలం మల్యాల. నేను దివ్వాంగుడిని. 2015 నుంచి 2025 వరకు పెన్షన్‌ వచ్చింది. మధ్యలో ఆగిపోయింది. సదరం సర్టిఫికెట్‌ ఉంది. తిరిగి పెన్షన్‌ వచ్చేలా చూడండి.

– ఈసరి సాత్విక్‌, మల్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement