సిరిసిల్ల: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 29 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు చేరువ చేయడమే లక్ష్యమన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన 29 ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ ఆ సమస్యలు ఏ మేరకు పరిష్కారమయ్యాయో సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డి
సిరిసిల్ల అర్బన్ / తంగళ్లపల్లి: సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సత్తు శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. ఈమేరకు సోమవారం వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి కె.సురేంద్రమోహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సిరిసిల్ల మార్కెట్ యార్డ్‌లో డైరెక్టర్లతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా గుగ్గిళ్ల శ్రీకాంత్‌గౌడ్, డైరెక్టర్లుగా ధర్మారెడ్డి హారిక, కొత్త రవీందర్, స్వర్గం రాజు, షేక్ ఇక్బాల్, ఎలుక తిరుపతి, మొగిలి సంపత్, కొమ్మిటి బాపురెడ్డి, పయ్యావుల శ్రీ కాంత్, బోండ్ల శ్రీశైలం, చేపూరి లక్ష్మణ్‌లను పలువురు సన్మానించారు.
రాష్ట్రస్థాయికి ఎంపిక
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని శివనగర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్స్ ట్రాక్ జిల్లాస్థాయి పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 13 మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. నలుగురు పోటీల్లో పాల్గొన్నారు. ఇద్దరికీ ఒక టీం చొప్పు న రెండు టీంలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు డీవైఎస్‌వో అజ్మీర రాందాస్ తెలిపారు. విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో కస్తూరి ఆకాంక్ష, ద్వితీయస్థానంలో గరిగే అనూష, తృతీయ స్థా నంలో కట్కూరి షకీనా, మేఘం, ఒద్యారం కా ర్తికేయ నిలిచారు. వికసిత్ భారత్ కో ఆర్డినేటర్ కిరణ్ రాజురావు, గోనె బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలి
తంగళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తంగళ్లపల్లిలోని ఫ్రెండ్స్‌క్లబ్‌లో సోమవారం ని ర్వహించిన సంఘం సమావేశానికి హాజరై మా ట్లాడారు. వెంకటేశ్, మహేశ్, అంజన్న, బొమ్మ క్క, లక్ష్మి, నర్సవ్వ, రమేశ్, రాజు, ఇందిరా, జ్యో తి, నాగలక్ష్మి, పద్మ, రజిత, లావణ్య పాల్గొన్నారు.


