నాంపల్లిలో కూలి పనులు లేక కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది. మాకు ప్రతీ రోజు కూలీకి వెళ్తే తప్ప పొట్ట గడవడం కష్టం. ప్రభుత్వం దృష్టి సారించి ఉపాధి పనులు కల్పించాలి.
– బడుగు పద్మ, నాంపల్లి
వ్యవసాయం సరిగా లేదు
గతంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధిహామీ పనులకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఉపాధి పనులు లేవు. ఇప్పుడు వ్యవసాయం కూడా కష్టంగా ఉంది. పనులు లేక ఇంటి వద్దనే ఉంటున్నాము.
– జడల లక్ష్మి, నాంపల్లి


