వేములవాడఅర్బన్: పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేమలవాడ అర్బన్ మండల చేయూత పింఛన్ మంజూరుపత్రాలను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. విప్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఓ వైపు అభివృద్ది, మరో వైపు సంక్షేమం సమాంతరంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని అర్హులైన 60 మందికి రూ.17.40 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను విప్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, పార్టీ మండల అధ్యక్షుడు పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.


