అందుబాటులో అన్ని రకాల వస్తువులు
తక్కువ ధరలో నిత్యావసరాలు ఆదివాసీలకు అండగా నిలుస్తున్న అంగళ్లు
ఓపీఎస్ అమలు చేయాలి
సిరిసిల్ల: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రేగుల సంజీవ్‌కుమార్ కోరారు. కలెక్టరేట్‌లో సీపీఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 17న నిర్వహించే సామూహిక సెలవు, శాంతియుత ధర్మదీక్ష కార్యక్రమంలో జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలపాలన్నారు. సీపీఎస్‌తో ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను వివరిస్తూ, పాత పెన్షన్ విధానం సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఓపీఎస్ సాధించేదాకా విశ్రమించవద్దని కోరారు. సంఘం ప్రతినిధులు కత్తి రమేశ్, చాడ ప్రత్యూషరెడ్డి, సంపత్, మహేశ్‌గౌడ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రంగి: గ్రామీణ సంస్కృతిలో భాగమైన అంగళ్లకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. వారసంతలే గిరిజనులు, గ్రామీణుల నిత్యావసరాలు తీరుస్తున్నాయి. తాజా కూరగాయలు, వివిధ రకాల ధాన్యాలు, నిత్యావసరాలు, దుస్తులు.. ఇలా అన్నీ ఒకేచోట లభిస్తుండడంతో అంగళ్లకు రోజురోజుకు క్రేజీ పెరుగుతోంది. దళారుల ప్రమేయం లేకుండా రైతులు, చిరువ్యాపారులే సంతలో విక్రయాలు జరుపుతుండగా పల్లెప్రజలు వచ్చి తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు.
అటవీ ఉత్పత్తులు కూడా..
గ్రామాల్లో పండిన కూరగాయలను రైతులే నేరుగా అంగడికి వచ్చి అమ్ముతుంటారు. గిరిజనులు జొన్నలు, కొర్రలు, రాగులు, అటవీప్రాంతంలో సహజసిద్ధంగా లభించే ఇప్పపువ్వు, చింతపండు, వెదురు చిగుళ్లు విక్రయిస్తుంటారు. ఇళ్లల్లో తయారుచేసే పసుపు, కారం, సంప్రదాయ పిండి వంటలు, గృహోపకరణాలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
వసతులు లేక అవస్థలు
సంతలకు ఆదరణ పెరుగుతున్నా వసతులు కల్పించడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంగడి ప్రాంతాల్లో బురద సమస్య తలెత్తకుండా సిమెంట్ ప్లాట్‌ఫామ్స్, ఐటీడీఏ, పంచాయతీరాజ్ నిధులతో షెడ్లు నిర్మించాలని వ్యాపారులు కోరుతున్నారు.
జిల్లాలో అంగడి వారాలు ఇలా..
వారం ప్రాంతాలు
ఆదివారం నిజామాబాద్, లింగంపేట, ముస్తాబాద్, వీర్నపెల్లి, గజసింగవరం, ఇందిరమ్మ కాలనీ
సోమవారం మామిడిపల్లి, మల్కపేట, తెర్లుమద్ది, వన్‌పల్లి, లింగన్నపేట, వంతడుపుల
మంగళవారం చందుర్తి, కందికట్కూర్, వట్టిమల్ల, కొలనూర్, మండెపల్లి
బుధవారం బావుసాయిపేట, నాగారం, నారాయణపూర్, గర్జనపల్లి, బద్దెనపల్లి
గురువారం గూడెం, ఇల్లంతకుంట, పల్లిమక్త, కోనరావుపేట, సారంపల్లి
శుక్రవారం మల్యాల, ఎల్లారెడ్డిపేట, ఆవునూరు, పొత్తూరు, నిమ్మపల్లి, ధర్మారం
శనివారం కనగర్తి, మరిమడ్ల, రాచర్లగొల్లపెల్లి, రేపాక, మర్ధనపేట
తక్కువ ధరకే..
పట్టణాల్లోని ధరలతో పోలిస్తే వారసంతల్లో కూరగాయలు, ఆకుకూరలు తక్కువ ధరకే లభిస్తాయి. నిత్యావసరాలు, దుస్తులు కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం వస్తలేదు.
– దుంపెట జలజ, గృహిణి, రుద్రంగి
గిట్టుబాటు అవుతోంది
నేను పండించిన తాజా ఆకుకూరలు, కూరగాయలు వా రంలో నాలుగు అంగళ్లకు తీ సుకెళ్లి అమ్ముతున్న. గతంలో దళారులకు విక్రయించి నష్టపోయిన. ఇప్పుడు నేనే సంతలో కూర్చుని అమ్ముకుంటున్న. కూరగాయలు తా జాగా ఉండడంతో ధర గిట్టుబాటు అవుతుంది.
– అల్లూరి లత, రైతు, రుద్రంగి


