దశలవారీగా సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

దశలవారీగా సమస్యల పరిష్కారం

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట: రాష్ట్రంలో ఏళ్లకొద్ది ఉన్న సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని సుద్దాలలో రూ.10 లక్షలతో నిర్మించిన సింగిల్‌విండో గోదామును మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో చేయలేని అభివృద్ధి పనులను ప్రజా ప్రభుత్వంలో చేస్తున్నామన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఐదు విజయవంతంగా నెరవేర్చామని, ఈ నెల 19న ఇందిరాగాందీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో ఇందిరమ్మ జీవితబీమా పథకాన్ని సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. గతంలో రైతులకు ఉచిత విద్యుత్‌ అమలు చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని, ఆయన స్ఫూర్తితోనే అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తహసీల్దార్‌ వరలక్ష్మి, విండో చెర్మన్లు బొమ్మెన భాస్కర్‌రావు, చేపూరి గంగాధర్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానుక సత్యం, ఏఎంసీ చైర్మన్‌ ఎల్లయ్య, వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, డైరెక్టర్లు వీరవేణి తిరుపతియాదవ్‌, ఐదరి శ్రీనివాస్‌, నూగూరి గణేశ్‌, ఉప్పుల గంగయ్య, సంజీవ్‌, మాజీ జెడ్పీటీసీలు బండ నర్సయ్య, గొట్టె రుక్మిణి, నాయకులు కర్రోళ్ల భాస్కర్‌, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement