ముస్తాబాద్: ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేను రైతుల సమక్షంలోనే చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని మొర్రాపూర్‌తండాలో భూముల రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీసర్వేపై రైతులకు ముందస్తు సమాచారం అందించి, పారదర్శకంగా గడువులోగా చేపట్టాలని స్పష్టం చేశారు. ల్యాండ్ రికార్‌ుడ్స ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ అబ్దుల్ ఫారూక్, సర్పంచ్ రాజునాయక్, ఆర్‌ఐ ప్రవీణ్ తదితరులున్నారు.
ఆలయాల అభివృద్ధికి సహకరించండి
ఎల్లారెడ్డిపేట: సిరిసిల్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి, ఎల్లారెడ్డిపేటలోని వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధికి సహకరించాలని ఏపీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని జిల్లాకు చెందిన నాయకులు మంగళవారం విజయవాడలో కలిసి విన్నవించారు. ఆలయాల పునర్‌నిర్మాణం, అభివృద్ధి పనులకు టీటీడీ తరఫున నిధులు మంజూరు చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సర్పంచ్ ఎలగందుల నర్సింలు, వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుండం సుధాకర్‌రెడ్డి, నాయకులు మీసం రాజం తదితరులు ఉన్నారు.
రాజన్న ఆలయ పురోగతిపై సమీక్ష
వేములవాడ: రాజన్న ఆలయ పురోభివృద్ధిపై వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ) అధికారులతో హైదరాబాద్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు నాణ్యతా ప్రమాణాలు, ఆగమశాస్త్ర ప్రకారం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 2027 పండుగల తేదీల ఖరారుపై ప్రజాభవన్‌లో స్థానాచార్యులు, అర్చకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్య, దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు, దేవాదాయ ధార్మిక అడ్వైజర్ గోవిందహరిలకు అర్చకులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం, 2027 క్యాలెండర్ అందజేశారు. ఈవో రమాదేవి, స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ, అర్చకులు పాల్గొన్నారు.
జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
సిరిసిల్లఅర్బన్: జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పరిహారం చెల్లించాలన్నారు. 14 రకాల నిత్యావసర సరుకులు రేషన్ ద్వారా పంపిణీ చేయాలని కోరారు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు ఉపాధి పనులు కల్పించి, పశువులకు మేత సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు కడారి రాములు, వేణు, తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, దుండ్రపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


