మహిళలకు సారె | - | Sakshi
Sakshi News home page

మహిళలకు సారె

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

● తుది దశకు చీరల ఉత్పత్తి ● 19న పంపిణీకి ఏర్పాట్లు ● ఇప్పటికే 5 కోట్ల మీటర్ల బట్ట సేకరణ ● 11,300 మగ్గాలపై రోజుకు 4 లక్షల మీటర్ల ఉత్పత్తి

సిరిసిల్ల చీరె..

సిరిసిల్ల: రాష్ట్రంలోని మహిళలకు ఇందిరా మహిళాశక్తి పథకంలో ఉచితంగా చీరలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. స్వశక్తి సంఘాల్లోని 95 లక్షల మంది మహిళలకు ఒకే రకమైన చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు రాష్ట్రంలోని మరో 12 కేంద్రాల్లోని నేతన్నలకు ఏప్రిల్‌లో చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. ఇప్పటికే 75 లక్షల చీరల ఉత్పత్తి పూర్తయింది. మిగతా చీరల ఉత్పత్తిని నేతన్నలు పూర్తి చేస్తున్నారు. మొత్తం ఆర్డర్లలో అగ్రభాగం సిరిసిల్లలోనే తయారీ అవుతున్నాయి.

ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి స్వరూపం

మొత్తం సాంచాలు : 26,302

ఉత్పత్తి చేస్తున్న సాంచాలు : 11,300

మ్యాక్స్‌ సంఘాలు : 133

వస్త్రోత్పత్తి ఆర్డరు ్ల: 6.33 కోట్ల మీటర్లు

కేటాయించిన నిధులు : రూ.334 కోట్లు

పూర్తయిన బట్ట ఉత్పత్తి : 5.30 కోట్ల మీటర్లు

సేకరించిన చీరల బట్ట : 5.00 కోట్ల మీటర్లు

ఇంకా ఉత్పత్తి చేయాల్సిన బట్ట

: 1.33 కోట్ల మీటర్లు

చీరల బట్ట ఇవ్వాల్సిన గడువు : నవంబరు 15

నేతన్నలకు పని లభించే కాలం

: 6 నుంచి 8 నెలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement