● రేయింబవళ్లు ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

● రేయింబవళ్లు ఉత్పత్తి

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

● రేయింబవళ్లు ఉత్పత్తి ● మొన్న పాలపిట్ట.. ● రెండు విడతల్లో ఆర్డర్లు

వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్లలో నేతన్నలు రేయింబవళ్లు శ్రమిస్తూ చీరల బట్ట ఉత్పత్తి చేస్తున్నారు. స్థానిక వస్త్రపరిశ్రమలో 11,300 పవర్‌లూమ్స్‌పై నిత్యం 4 లక్షల మీటర్ల మేరకు చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికే 5 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేయగా, మరో 1.20 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేసేలా ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలోని తెల్లరేషన్‌కార్డు ఉన్న కుటుంబాల మహిళలకు వారం రోజులపాటు చీరలు పంపిణీ చేయనున్నారు. చీరల పంపిణీకి ప్రత్యేక యాప్‌ సిద్ధం చేశారు. చీరల పంపిణీ కేంద్రాలు, ఇళ్ల వద్ద ఆధార్‌ కార్డుల ఆధారంగా యాప్‌లో ఫొటో తీసుకుని వివరాలు ధ్రువీకరించనున్నారు.

నేడు చిలుకపచ్చ రంగు

రాష్ట్రంలోని కోటి ఐదు లక్షల మంది మహిళలకు ఒకే రంగు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిరిసిల్లతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు అందించారు. జరీ అంచు బార్డర్‌తో 6.30 మీటర్ల పొడవు ఉండే చీరలను 95 లక్షల మేరకు ఆర్డర్లు ఇవ్వగా.. మరో 10 లక్షల మేరకు 9 మీటర్ల గోచీ చీరలు ఆర్డర్లు ఇచ్చారు. 58 ఏళ్లు పైబడిన మహిళా సంఘాల్లోని వృద్ధులకు గోచీ చీరలు అందించనున్నారు. సిరిసిల్లతోపాటు కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తిలోనూ గోచీ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. జరీ అంచుతో కూడిన పాలిస్టర్‌, కాటన్‌ మిక్స్‌ చీరలను ప్రాసెసింగ్‌ చేసి చిలుక పచ్చరంగులో ప్రింట్‌ చేస్తున్నారు.

సిరిసిల్లలోని 133 మ్యాక్స్‌ సంఘాలతోపాటు కరీంనగర్‌, హనుమకొండ జిల్లాలోనూ 13 కేంద్రాల్లో చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి 3.01 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వగా.. రెండో విడతగా ఏప్రిల్‌లో మరో 1.63 కోట్ల మీటర్లు, మూడో విడతగా 1.62 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి వేములవాడలో ప్రభుత్వమే యారన్‌(నూలు) డిపో ఏర్పాటు చేసింది. నూలును నేరుగా కొనుగోలు చేసి బఫర్‌ స్టాక్‌గా ఉంచడానికి రూ.50కోట్ల కార్ఫస్‌ ఫండ్‌ మంజూరు చేసింది. సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు నూలును 90 శాతం అరువుపై సరఫరా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో టెక్నికల్‌ బృందాలు తనిఖీ చేస్తున్నాయి.

ఒక్క నెలలోనే కోటి మీటర్లు

సిరిసిల్లలో చీరల బట్ట ఉత్పత్తి వేగంగా సాగుతోంది. ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో కోటి మీటర్ల బట్ట సేకరించాం. మొదట్లో చీరల బట్ట ఉత్పత్తి చేసే సాంచాల సంఖ్య తక్కువగా ఉండగా ఇప్పుడు పెరిగాయి. క్వాలిటీతో బట్ట ఉత్పత్తి చేస్తున్నారు.

– శ్రీరామ్‌ సంతోష్‌కుమార్‌,

చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement