● కలెక్టర్ గరీమా అగ్రవాల్
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట: తక్కువ విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన రైతు గుర్రాల సత్యంరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్ సందర్శించారు. సత్యంరెడ్డి 1.20 ఎకరాల్లోనే పది రకాల పంటలు పండిస్తూ ప్రతీ నెల రూ.50వేల వరకు ఆదాయం పొందుతున్నారు. వరికి బదులు కూరగాయలు సాగు చేస్తున్న రైతును కలెక్టర్ అభినందించారు. మిగతా రైతులు కూగా కూరగాయలు సాగుచేయాలని కోరారు. అలాగే గంభీరావుపేట మండలం రాజేశ్వర్‌రావునగర్‌లో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ఆయిల్‌పామ్ రైతులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు యాసంగిలో వరి సాగు చేయవద్దన్నారు. నువ్వులు, వేరుశనగ, పప్పుధాన్యాలు సాగు చేయాలని కోరారు. అనంతరం గజసింగవరంలోని అంగన్‌వాడీకేంద్రంలో గర్భిణులకు సీమంతం, పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో డీఏవో అఫ్జల్‌బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మండల ప్రత్యేకాధికారి హన్మంత్‌నాయక్, తహసీల్దార్లు దివ్య, మారుతిరెడ్డి, ఎంపీడీవోలు సత్తయ్య, రాజేందర్, సర్పంచ్‌లు పిట్ల బాబు, విమల, విండో చైర్మన్ వేశాల వెంకటి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కళావతి తదితరులు పాల్గొన్నారు.
‘చేయూత’ పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
సిరిసిల్ల: జిల్లాలో ‘చేయూత’ సామాజిక భద్రతలో భాగంగా కొత్తగా పెన్షన్ల అర్హత మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం శ్రీచేయూతశ్రీ పెన్షన్ల పంపిణీపై అధికారులతో సమీక్షించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు (తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా) గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. అర్హుల ఎంపిక కోసం మండల, జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో విచారణ చేయించామని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఈ నెల 12 నుంచి 18 వరకు అర్హులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలు అందజేయాలని ఆదేశించారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, చేనేత, జౌళిశాఖ ఏడీ ఎస్.సంతోష్‌కుమార్, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.


