మా గ్రామంలో కోతుల బెడద పెరిగిపోయింది. గ్రామస్తులు ఇబ్బందులు పడుతుండడంతో ఆంధ్రా నుంచి కోతులను పట్టేవారిని తెప్పించాము. రూ.2.50లక్షలు వెచ్చించి 400 కోతులను అటవీ ప్రాంతంలో వదిలివేశాం. అప్పటి నుంచి కోతుల బెడద తగ్గింది. ఏడాది లోపు మళ్లీ వస్తే వారే వచ్చి పట్టుకెళ్తారు.
– కుంటెల్లి నాగరాజు, సర్పంచ్, సుద్దాల
సమస్య తీవ్రంగా ఉంది
మండలంలోని అన్ని గ్రామాల్లో కోతుల సమస్య ఉంది. ఇళ్లలోకి వస్తూ వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. అడ్డుకోబోయిన వారిపై దాడులు చేస్తున్నాయి. గ్రామంలో ఇది వరకు కోతులను పట్టించి దూర ప్రాంతాల్లో వదిలిపెట్టినం. ప్రస్తుతం కొండెంగలు రావడంతో కోతుల సమస్య తగ్గింది.
– జలగం అరవింద్‌రావు, సర్పంచ్, కొలనూర్


