నాకు ఎకరం ఉంది. బావిలో నీరు లేక పొలం సాగుచేయలేదు. దగ్గరలోనే గోదావరి నీటిని తరలించేందుకు కాలువతీసిన. కాలువల ద్వారా గోదావరి నీరు రాకపోవడంతో బావిలోకి నీరు రాలేదు. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా కాలువలు పూర్తి చేయాలి.
– దేశవేని నర్సయ్య, రైతు, రుద్రంగి
త్వరలోనే కాలువలు పూర్తి చేస్తాం
త్వరలోనే కాలువల పనులు పూర్తి చేస్తాం. భూగర్భ జలాలు పెరగడానికి కాలువల్లో నీరు నిలువ ఉండేందుకు డ్రాపులు ఏర్పాటు చేశాం. కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగి నీరు మురికి కాకుండా చర్యలు తీసుకుంటాం. కాలువలను శుభ్రం చేయిస్తాం.
– సంతు ప్రకాశ్‌రావు, ఈఈ,
శ్రీపాద ఎల్లంపల్లి


