సూరమ్మ చెరువును గోదావరి నీళ్లతో నింపేందుకు రుద్రంగి వేంకటేశ్వరాలయం నుంచి తవ్విన కాలువ పనులు మధ్యలోనే వదిలేశారు. అసంపూర్తి కాలువలు ఇళ్లకు దగ్గరగా ఉన్నాయి. వర్షాలు కురిసినప్పుడు వాననీళ్లు బయటకు వెళ్లేందుకు దారి లేక మురిగి వాసన వస్తున్నాయి.
– నగురం గంగు, మహిళ, రుద్రంగి
తాగు, సాగునీరు ఇవ్వాలి
సూరమ్మ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నీటిని తరలించేందుకు తీసిన కాలువలను మధ్యలోనే వదిలేయడంతో ఈ ప్రాంత నాలుగు మండలాల రైతులకు సాగునీరు అందడం లేదు. ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఎక్కవగా ఉన్నందున ఇప్పటికై నా స్పందించి అసంపూర్తి కాలువలను పూర్తి చేయాలి. పనులు మధ్యలో వదిలేయడంతో వర్షపు నీరు నిలిచి కాలువలు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఇళ్ల పక్క నుంచే కాలువలు పోతుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కవగా ఉంది.
– గడ్డం మహేందర్, రైతు, రుద్రంగి


