సగంలోనే ఆగిపోయిన పనులు పిచ్చిమొక్కలతో దర్శనం నీరు నిలిచి.. దుర్వాసన ఇబ్బందిపడుతున్న స్థానికులు
రుద్రంగి: సూరమ్మ ప్రాజెక్టును నింపాలనే ఉద్దేశంతో చేపట్టిన ఎల్లంపల్లి కాలువలు అర్ధంతరంగా ని లిచిపోయాయి. సగంలోనే నిలిచిన కాలువలతో రు ద్రంగిలోని పలు కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పిచ్చిమొక్కలు మొలిచి.. వర్షం నీరు నిలిచి కంపుకొడుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించినా కొసముట్టని పనులతో రైతులు, రుద్రంగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నాలుగు మండలాలకు..
సూరమ్మ రిజర్వాయర్‌లకు గోదావరి నీటిని తరలించి రుద్రంగి, కథలాపూర్, మేడిపెల్లి, భీమారం నాలుగు మండలాల రైతులకు సాగునీరు అందించేందుకు తీసిన కాలువ అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు తాగునీరే దొరికే పరిస్థితి లేనందునా.. కా ల్వలు పూర్తి చేసి తాగు, సాగునీరందించాలని స్థాని కులు కోరుతున్నారు. అసంపూర్తి కాల్వలు లింగంపేట తెనుగుపల్లె, హరిజనవాడకాలనీ, రామకిష్టాపూర్‌కాలనీల్లో ప్రమాదకరంగా మారాయి.
మురికికూపాలు..
మండల కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిన కాలువలు వర్షాకాలంలో మురికికూపాలుగా మారుతున్నా యి. అసంపూర్తిగా ఉన్న కాలువల్లోని నీరు బయటకు వెళ్లే దారి లేక అందులోనే నిలిచి దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలు పెరిగి రోగాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఊరన్నీ కాలువలు..పంట పొలాలు బీళ్లు
గోదావరి నీటిని రుద్రంగిలోని చెరువుల్లోకి తీసుకొచ్చేందుకు తవ్విన కాల్వలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గోదావరి జలాలు రాక పంట పొలాలు బీళ్లుగానే ఉంటున్నాయి.


