● రూ.10లక్షలు సాయం చేసిన ఎమ్మెల్యే కేటీఆర్
గంభీరావుపేట: మండలంలోని గజసింగవరంలో తాగునీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా తాగునీటి బావిని పునరుద్ధరిస్తున్నారు. ఇందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ రూ.10లక్షల సహాయం అందించారు. బావికి సిమెంటు గాజులు ఏర్పాటు చేసే పనులను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు శుక్రవారం ప్రారంభించారు. రవీందర్రావు మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వానాకాలంలో పుష్కలంగా నీరుంటే గజసింగవరంలో నీటి ఎద్దడి ఉండేదన్నారు. బావి చెరువులో మునిగి పోయి తాగునీటి సమస్య తలెత్తేదన్నారు. సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా బావి చెరువులో మునిగిపోకుండా సిమెంటు గాజులు వేయించాలని అందుకు రూ. 10లక్షలు అందించినట్లు తెలిపారు. సర్పంచ్ ఉమారెడ్డి విమల తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ చౌర్యం నేరం
ముస్తాబాద్: విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవని విద్యుత్‌శాఖ డీఈ అంజయ్య హెచ్చరించారు. ముస్తాబాద్ మండలం నిమ్మవారిపల్లెలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను శుక్రవారం ప్రారంభించారు. రైతులు తప్పనిసరిగా విద్యుత్ కనెక్షన్లు పొందిన తర్వాతనే విద్యుత్‌ను వినియోగించుకోవాలని కోరారు. సాగుకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సర్పంచ్ రఘు, ఏఈ విష్ణుతేజ పాల్గొన్నారు.
సమ్మె కొనసాగిస్తాం
సిరిసిల్ల అర్బన్: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించకపోవడంతోనే సమ్మెకు దిగినట్లు తెలిపారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి చర్చలు చేపట్టాలని కోరారు. సీఐటీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ పాడుగుల సుధాకర్, జిల్లా కార్యదర్శి కోడం రమణ, గుర్రం అశోక్, కాసారపు శంకర్ పాల్గొన్నారు.
జిల్లా సరిహద్దులపై భూ రీసర్వే
గంభీరావుపేట(సిరిసిల్ల): భూభారతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రీ సర్వే శుక్రవారం గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లిలో జరిగింది. రాజన్నసిరిసిల్ల గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ మధ్య రెండు జిల్లాల సరిహద్దు నిర్ణయం కోసం రీసర్వే చేశారు. రెండు జిల్లాల అధికారులు సర్వేలో పాల్గొన్నట్లు తహసీల్దార్ మారుతిరెడ్డి తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసు ‘సోషల్’ ప్రచారం
సిరిసిల్ల: మద్యం సేవించి వాహనం నడపడం మీ ప్రాణాలకే కాదు.. ఇతరుల ప్రాణాలకూ ముప్పు అని జిల్లా పోలీసులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం.. జీవితాంతం తీరని నష్టమంటూ.. మద్యం మత్తులో డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరుతున్నారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలను నివారించండని కోరుతున్నారు. మీ కుటుంబంతోపాటు ఇతరుల కుటుంబాల్లోనూ ఆనందాన్ని కాపాడండి.. మద్యం తాగితే డ్రైవింగ్ వద్దు.. సురక్షిత ప్రయాణమే లక్ష్యమని ప్రత్యేక పోస్టర్‌తో ప్రచారం చేస్తున్నారు.


