● మద్దతు ధరకు మించి ప్రైవేటు కొనుగోళ్లు ● దిగుబడి తగ్గి.. పెరిగిన ధర ● సీసీఐ కొనుగోళ్లు శూన్యం ● పల్లెల్లో వ్యాపారుల కొనుగోళ్ల జోరు
● జిల్లాలో 50,275 ఎకరాల్లో పత్తి సాగు ● రైతుల చేతికందుతున్న ‘తెల్ల’బంగారం
ఇది వేములవాడ అర్బన్ మండలం మారుపాక శివారులోని పత్తి చేను. నల్లరేగడి నేలలో ఏపుగా ఎదిగిన పత్తిమొక్కల సాళ్లలో మహిళా కూలీలు పత్తి ఏరుతున్నారు. ఒక్క కిలో ఏరితే రూ.10 కూలి చెల్లిస్తున్నారు. ఇలా ఒక్కో మహిళ 35 నుంచి 50 కిలోల వరకు పత్తి ఏరుతున్నారు. కూలీలు ఏరిన పత్తి ఆధారంగా డబ్బులు అదే రోజు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో కూలీకి నిత్యం రూ.350 నుంచి రూ.500 వరకు కై కిలి గిట్టుబాటు అవుతుంది.


