‘సైబర్‌ నేరగాళ్ల’పై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

‘సైబర్‌ నేరగాళ్ల’పై అప్రమత్తంగా ఉండాలి

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల: సైబర్‌ నేరాలపై జిల్లా ప్రజలను అప్రమత్తం చేసేందుకు నవంబర్‌ నెలను ‘యువర్‌ మనీ, యువర్‌ క్లిక్‌, యువర్‌ చాయిస్‌’ అనే ఇతివృత్తంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీస్‌ ఆఫీస్‌లో గురువారం సైబర్‌ నేరాల నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఆన్‌లైన్‌ లావాదేవీల విషయంలో అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే ముందు క్షణం ఆగి, డబ్బులు స్వీకరించే వ్యక్తి, సంస్థ వివరాలు పూర్తిగా ధ్రువీకరించుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ ప్రకటనలను నమ్మవద్దని కోరారు. గూగుల్‌, సోషల్‌మీడియాలో కనిపించే ప్రతీ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ నిజమైందని భావించొద్దని ఎస్పీ వివరించారు. ఎవరైనా సైబర్‌ ఆర్థిక మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు. సైబ ర్‌ ఆర్‌ఎస్సై జునైద్‌, సైబర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement