● ‘సమాజానికి రంపపు కోత వద్దు’పై అవగాహన
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్(పీటీఎం)లో ఉపాధ్యాయులు ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీని ఓ సాధనంగా వినియోగించారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘సమాజానికి రంపపు కోత వద్దు’ శీర్షికన ప్రచురితమైన కథనం గురించి తొలుత చర్చించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 18 సూత్రాల్లో వివరించిన దినపత్రికను అందజేశారు. కథనాన్ని పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రదర్శనకు ఉంచిన సాక్షి ఫ్యామిలీ పేజీని తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజనీదేవి, సుజాత, సీహెచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


