24 గంటల్లోపు చైన్‌స్నాచింగ్‌ ఛేదన | - | Sakshi
Sakshi News home page

24 గంటల్లోపు చైన్‌స్నాచింగ్‌ ఛేదన

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

జగిత్యాలక్రైం/కొడిమ్యాల: నేరాలు జరిగినప్పుడు సత్వరమే స్పందిస్తే నిందితులను సకాలంలో గుర్తించవచ్చని జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కొని పరారైన నిందితులను 24 గంటల్లోపు పట్టుకోవడంలో కృషిచేసిన మల్యాల సీఐ రాజ్‌కుమార్‌, కొడిమ్యాల ఎస్సై నరేశ్‌, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను గురువారం అభినందించి బహుమతులు అందజేశారు. నేరం జరిగిన వెంటనే స్పందించి ఆధునిక పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో పోలీసులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ కేసును తొందరగా ఛేదించడం జరిగిందన్నారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement