● ఎస్పీ మహేశ్ బీ గీతే ● కానిస్టేబుల్, హోంగార్డులకు అభినందనలు
సిరిసిల్ల: ప్రజల రక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించడంతోపాటు ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా పోలీసుల ప్రధాన కర్తవ్యమని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయిన మహిళకు తక్షణ సహాయం అందించిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్‌చారీలను సోమవారం ఎస్పీ అభినందించారు. ప్రోత్సహకాలు, ప్రశంసాపత్రాలు అందించారు. పోలీస్‌శాఖ ప్రతిష్టను పెంచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. గ్రీవెన్స్ డేకు 19 ఫిర్యాదులు రాగా.. బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదులపై ఆయా ఠాణాల అధికారులకు ఫోన్ చేసి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ.. సమీక్షిస్తున్నామని తెలిపారు.
పోలీస్‌యాక్ట్ అమలు
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 30 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించరదాని స్పష్టం చేశారు.


