కాలనీల్లో కారుచీకట్లు | - | Sakshi
Sakshi News home page

కాలనీల్లో కారుచీకట్లు

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

● సిరిసిల్లలో వెలగని వీధిదీపాలు ● దొంగలు, విషపురుగుల భయం ● విలీన గ్రామాల్లో పట్టించుకోని అధికారులు సిరిసిల్ల పరిధిలో లైట్ల వివరాలు

● సిరిసిల్లలో వెలగని వీధిదీపాలు ● దొంగలు, విషపురుగుల భయం ● విలీన గ్రామాల్లో పట్టించుకోని అధికారులు
సిరిసిల్ల పరిధిలో లైట్ల వివరాలు
18 వాట్స్‌ 6,68635 వాట్స్‌ 1,00070 వాట్స్‌ 250110 వాట్స్‌ 461190 వాట్స్‌ 50

సిరిసిల్లటౌన్‌: కార్మికక్షేత్రంలోని కాలనీల్లో కారుచీకట్లు కమ్ముకున్నాయి. ఒకప్పుడు వందశాతం ఎల్‌ఈడీ లైట్లు వినియోగించి ఆదర్శంగా నిలిచిన సిరిసిల్లలోని పలు కాలనీల్లో నేడు అంధకారం అలుముకుంది. విలీన గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. రోడ్లపై స్తంభాలు కనిపిస్తున్నా, వాటిపై లైట్లు వెలగడం లేదు. రాత్రి అంతర్గత కాలనీల్లో చీకట్లు కమ్ముకుని ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.

వెన్నెల వెలుగుల నుంచి కారుచీకట్లు

గతంలో ఎల్‌ఈడీ వెలుగులతో నిండిపోయిన సిరిసిల్లలోని పలు అంతర్గత కాలనీల్లో నేడు అంధకారం నెలకొంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో డివైడర్ల మధ్య, రగుడు జంక్షన్‌లో లైట్లు పెట్టించినా.. కాలనీలు, ఇతర ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకోవడం విమర్శలకు తావిస్తోంది. పెద్దూరు డబుల్‌బెడ్రూం కాలనీలో స్తంభాలు ఉన్నా లైట్లు అమర్చలేదు. అంబికానగర్‌లో నిర్వహణ లోపం కనిపిస్తోంది. చీకటిని ఆసరాగా చేసుకుని దొంగతనాలు పెరిగిపోతున్నాయి. మార్కెట్‌పల్లి, బల్యాలనగర్‌, గణేశ్‌నగర్‌, తారకరామానగర్‌, బీవైనగర్‌, ఇందిరానగర్‌, విద్యానగర్‌, నెహ్రూనగర్‌, జేపీనగర్‌, పద్మనగర్‌, వెంకంపేట, ఆసిఫ్‌పుర, అశోక్‌నగర్‌, సాయినగర్‌, సర్దాపూర్‌, బోనాల, పెద్దబోనాల, రాజీవ్‌నగర్‌, చంద్రంపేటల్లో లైట్లు వెలగడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement