● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో నూతన ఆస్పత్రుల భవన పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్ల నిర్మాణం, జిల్లా కేంద్రంలోని జీజీహెచ్, ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీల్లో వసతుల కల్పనపై శుక్రవారం ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 16 సబ్‌సెంటర్లలో ఇప్పటికే 7 పూర్తి అయ్యాయని, మిగతావి ప్రగతిలో ఉన్నాయని, రుద్రంగిలో పీహెచ్‌సీ, ఇల్లంతకుంటలో సీహెచ్‌సీ పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్, వేములవాడ ఏరియా ఆస్పత్రి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట సీహెచ్‌సీల్లో వైద్య పరికరాలు, సామగ్రిని సమకూర్చాలన్నారు. జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఈఈ పీఆర్ సుదర్శన్‌రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వేములవాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుభాషిణి, వైద్యులు సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందనలు
ఆర్టులో రాణిస్తున్న బోయినపల్లిలోని గురుకుల విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థులు కె.వెంకటేశ్‌బాబు, కె.కార్తీక్ కె.శ్రీవాస్తవ్, యు.రాణా ప్రతాప్‌లను కలెక్టర్ అభినందించారు. బోయినపల్లి మండల ప్రత్యేకాధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథం, ఆర్ట్ టీచర్ వీణాదేవి పాల్గొన్నారు.
తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
జిల్లాలో తాగునీటి ఇబ్బందులు రానీయొద్దని కలెక్టర్ ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం.. వేసవి కాల ప్రణాళికపై మిషన్ భగీరథ అధికారులతో సమీక్షించారు. అగ్రహారం, రుద్రవరం పంప్‌హౌస్‌లలోని పంపుసెట్లను ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలన్నారు. మిషన్ భగీరథ ఎస్‌ఈ రాములు, ఈఈలు ముజాహిద్ అన్వర్, సుమలత, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు రాము, విశ్వన్ పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి సమీక్షించారు. కలెక్టర్‌తోపాటు ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, దేవాదాయశాఖ ధార్మిక సలహాదారు గోవిందహరి పాల్గొన్నారు.


