ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలి

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలి బాలల భద్రత.. అందరి బాధ్యత ఓటరు జాబితాపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సరిహద్దులు పక్కాగా నమోదు చేయాలి

తంగళ్లపల్లి: ప్రజలకు పారదర్శకమైన, మెరుగైన పోలీస్‌ సేవలందించాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే సూచించారు. తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ ను శుక్రవారం తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్‌ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా, పెట్రోలింగ్‌ వ్యవస్థ అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. విజిబుల్‌ పోలీసింగ్‌ ద్వారానే ప్రజల్లో పూర్తిస్థాయి భద్రతాభావం కలుగుతుందన్నారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని ఆదేశించారు. యువత మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, రూరల్‌ సీఐ నాగేశ్వరరావు, తంగళ్లపల్లి ఎస్సై సిరిసిల్ల అశోక్‌ పాల్గొన్నారు.

సిరిసిల్ల: బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోక్సో కోర్టు ప్రత్యేక జిల్లా న్యాయమూర్తి రాధిక జైస్వాల్‌ పేర్కొన్నారు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌ హైస్కూల్‌లో శుక్రవారం ‘సురక్షిత్‌ బచ్పన్‌ అభియాన్‌’ అవగాహన సదస్సు నిర్వహించారు. రాధికా జైస్వాల్‌ మాట్లాడుతూ పిల్లల రక్షణ, హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన ఉండాలన్నారు. వేధింపులు, అనుచిత ప్రవర్తన ఎదురైతే భయపడకుండా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించడం గురించి వివరించారు. పిల్లలు తమకు ఎదురయ్యే వేధింపులపై నిర్భయంగా స్కూళ్లలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టె ద్వారా తెలియజేయాలని కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. హెచ్‌ఎం ఎన్‌.రమాదేవి, ప్రభుత్వ న్యాయవాది కల్యాణ్‌ చక్రవర్తి, లోక్‌ అదాలత్‌ సభ్యుడు చింతోజు భాస్కర్‌, న్యాయవాదులు ఆడెపు వేణు, పెంట శ్రీనివాస్‌, కుంట శ్రీనివాస్‌, కళ్యాణి, జైశ్వర్య పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: ఓటరు జాబితా సవరణపై కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నా రు. సిరిసిల్లలోని తన నివాసంలో శుక్రవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచే ఎన్నికల వ్యవస్థలో భాగంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందన్నారు. దీనిని తమ సొంత కార్యక్రమంగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని తప్పుబట్టారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు జాబితాలో కొనసాగడం, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు నమోదు కావడం వంటి లోపాలను గుర్తించి సరిచేయ డం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమన్నా రు. ఓటర్ల జాబితా సవరణ అనేది రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియలో భాగమన్నారు. నిబంధనలకు లోబడే ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపడుతున్నారని వివరించారు. కొండ నరేశ్‌, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

వేములవాడఅర్బన్‌: భూముల రీసర్వేలో ప్రభుత్వ భూములు, పట్టా భూములకు సంబంధించిన సరిహద్దులు పక్కాగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ అధికారులను ఆదేశించారు. వేములవాడ మండలం రుద్రవరంలో చేపడుతున్న భూముల రీసర్వే ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. డీఐ రాజేంద్రప్రసాద్‌, నాయబ్‌ తహసీల్దార్‌ లీలారాణి, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement