కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొడతాం | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొడతాం

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

● సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి ● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ● చలో ఢిల్లీకి తరలిన నాయకులు

● సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి ● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ● చలో ఢిల్లీకి తరలిన నాయకులు

వేములవాడరూరల్‌/సిరిసిల్లటౌన్‌: ఓటుహక్కు కా పాడటమే లక్ష్యంగా కేంద్రంపై పోరాటానికి కాంగ్రెస్‌ సిద్ధమైందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడ రూరల్‌ మండలం నూకలమర్రిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 1న ఢిల్లీలో చేపట్టే నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. ఢిల్లీకి వెళ్తున్న కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గతంలో బిహార్‌, ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించినట్లు ఆరోపించారు.

కాంగ్రెస్‌ నేతల చలో ఢిల్లీ

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ నిరసన కార్యక్రమానికి జిల్లా నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం భారీ సంఖ్యలో తరలివెళ్లారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement