సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని లిఫ్ట్ రెండు రోజులుగా పని చేయడం లేదు. దీంతో రెండో అంతస్తులో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. లిఫ్ట్‌ను బాగు చేయించాల్సిన ఆస్పత్రి అధికారులు పట్టించుకోవడం లేదు. రెండో అంతస్తులో ఎక్కువ మంది రోగులు ఉండడంతో మెట్లు, ర్యాంపు ద్వారా వచ్చిపోయేందుకు ఇబ్బందిపడుతున్నారు.
సిరిసిల్లటౌన్: పురపాలక సంఘం సాధారణ సమావేశం శనివారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎం.ఏ.ఖదీర్‌పాషా శుక్రవారం తెలిపారు. చైర్‌పర్సన్ జిందం కళ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను ప్రెస్‌మీట్‌లో వివరిస్తారని తెలిపారు.


