సిరిసిల్ల: కుష్ఠును ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఎల్సీడీసీ(లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) సర్వేను రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రాజు, డీపీఎంవో వెంకటేశ్వరాచారి శుక్రవారం పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న సర్వేకు ప్రజలు ఆరోగ్య సిబ్బందికి సహకరించాలన్నారు. పట్టణంలోని సుందరయ్యనగర్, అంబేడ్కర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి కుష్ఠు గుర్తింపు సర్వేను పర్యవేక్షించారు. సర్వేలో నిర్లక్ష్యం లేకుండా ప్రతీ ఇంటిని సందర్శించాలని సూచించారు. కుష్ఠు లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామ్‌రెడ్డి, వైద్యాధికారులు సాహితి, రేఖ, డీపీఎంవో దేవ్‌సింగ్ పాల్గొన్నారు.


