● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: పోలీసు అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని హెబ్రోసు చర్చిలో మంగళవారం పో లీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరచిపోవద్దన్నారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి పోలీస్‌శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ప్రజ లందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని, సమాజంలో మతసామరస్యం, శాంతిసామరస్యాలు వెల్లివిరియాలని చర్చి ప్రతినిధులతో కలిసి ప్రార్థించారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, పట్టణ సీఐ శ్రీనివాస్, చర్చి పాస్టర్లు, ఫాదర్లు పాల్గొన్నారు.
నేడు 2కే రన్
సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి మానేరు తీరంలోని బతుకమ్మ ఘాట్ వరకు బుధవారం 2కే రన్ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఉదయం 6.45 గంటలకు 2కే రన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.


