రుద్రంగి(వేములవాడ): భూముల రీ సర్వే ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. మండలకేంద్రంలో కొనసాగుతున్న రీ సర్వేను మంగళవారం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ సర్వే నంబర్‌కు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలన్నారు. సర్వే చేయబోయే భూములకు సంబంధించిన రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, వారి సమక్షంలో రీ సర్వే చేపట్టాలని సూచించారు. సర్వేకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.


