చికిత్స పొందుతూ ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఒకరి మృతి

Oct 25 2026 12:17 AM | Updated on Oct 25 2026 12:17 AM

మెట్‌పల్లిరూరల్‌: రహదారిపై ఆరబోసిన మొక్కజొన్నపై ద్విచక్రవాహనం స్కిడ్‌ కావడంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. రాయికల్‌ మండలం ఇటిక్యాలకు చెందిన మరిపెల్లి రమేశ్‌(29) ఈ నెల 10న మల్లాపూర్‌ మండలం వీవీరావుపేటలో తన సోదరి ఇంటికి వెళ్లాడు. స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా గొర్రెపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించేందుకు ప్రయత్నించాడు. బస్సును తప్పించే చోట రహదారిపై మొక్కజొన్న ఆరబోసి ఉండడంతో ద్విచక్రవాహనంపై నుంచి స్కిడ్‌ అయి కిందపడగా, తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, 5 నెలల పాప ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి..

కొడిమ్యాల: మండలంలోని అప్పారావుపేట శివారు భవానికుంట సమీపంలో ఈ నెల 19న స్పృహ కోల్పోయి కింద పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని ప్రజాప్రతినిధులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై నరేశ్‌కుమార్‌ తెలిపారు. మృతుడిని గుర్తించినవారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement