మృత్యు దారులు | - | Sakshi
Sakshi News home page

మృత్యు దారులు

Oct 25 2026 12:17 AM | Updated on Oct 25 2026 12:17 AM

దైవ దర్శనానికి వెళ్లివస్తూ.. హుజూరాబాద్‌లో లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి ద్విచక్రవాహనాలు అదుపుతప్పి ఇద్దరు.. బైక్‌లు ఢీకొని మహిళ, వృద్ధురాలు కారు ఢీకొని ఒకరు.. కారు బోల్తాపడి మరో వ్యక్తి దుర్మరణం

హుజూరాబాద్‌రూరల్‌: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని సంతోషంగా తిరుగు ప్ర యాణమైన యువకులను రో డ్డు ప్రమాదం కబళించింది. శని వారం వేకువజామున హుజు రాబాద్‌ మండలం రంగాపూర్‌ శివారులో జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరాని కి చెందిన ఏడుగురు యువకులు కారులో శుక్రవారం విజయవాడకు వెళ్లి కనకదుర్గమ్మను ద ర్శించుకున్నారు. రాత్రి స్వగ్రామానికి పయనమయ్యారు. వీరి కారు రంగాపూర్‌ శి వారులోకి చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జు అ యింది. ఈ దుర్ఘటనలో బట్టారి అరవింద్‌ (20), మచ్చ సాయినాథ్‌ (20) అక్కడికక్కడే మృతిచెందా డు. కారులో ఉన్న మిగతా ఐదుగురు ఎరుకల సా యికృష్ణ, మచ్చ ఆదర్శ్‌, ముఖియా, వివేక్‌, శ్రీకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోవడంతో క్రేన్‌ను ర ప్పించారు. స్థానికుల సాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన ఐదుగురిని హుజూరాబాద్‌ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

దైవదర్శనం.. విషాదాంతం

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు.. ద్విచక్రవాహనాలు అదుపుతప్పి మరో ఇద్దరు.. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో మహిళ.. బైక్‌ ఢీకొని వృద్ధురాలు.. కారు ప్రమాదంలో వృద్ధుడు.. కారు బోల్తాపడి మరో వ్యక్తి.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శనివారం రహదారులు నెత్తురోడాయి. ఆయా ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతిచెందగా, బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement