24కేఎన్‌టీ130: ప్రణయ్‌కుమార్ (ఫైల్)
కరీంనగర్‌క్రైం: ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్న ఇద్దరు సోదరులు ప్రమాదానికి గురికాగా, వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. టూ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన రామిడి వరలక్ష్మి– శ్రీనివాస్ దంపతులకు రామిడి ప్రణయ్‌కుమార్(26), వినయ్ సంతానం. ప్రణయ్ పీజీ పూర్తి చేయగా, వినయ్ పీజీ చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇద్దరూ నుస్తులాపూర్‌లో ఓ ఫంక్షన్‌కు బైక్‌పై వెళ్లారు. శనివారం వేకువజామున కరీంనగర్ వస్తుండగా సప్తగిరికాలనీ ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ఆర్ బ్యాంకెట్ హాల్ సమీపంలో అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ప్రణయ్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వినయ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, భర్త ఉపాధి నిమిత్తం సింగపూర్‌లో ఉండగా, ఇద్దరు కుమారులే తనకు అండగా ఉన్నారని తల్లి వరలక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


