చితికిన బతుకులు | - | Sakshi
Sakshi News home page

చితికిన బతుకులు

Oct 25 2026 12:17 AM | Updated on Oct 25 2026 12:17 AM

బుగ్గ క్రాస్‌రోడ్డు వద్ద బోల్తా పడిన కారు

ద్విచక్రవాహనం అదుపుతప్పి..

సిరిసిల్లఅర్బన్‌: రాజన్న సిరిసిల్ల పట్టణ పరిధి రెండో బైపాస్‌లో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో పెద్దూరు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సమాదాయానికి చెందిన అన్నల్‌దాస్‌ కనుకయ్య (65) మృతిచెందాడు. మరమగ్గాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కనుకయ్య పని నిమిత్తం సిరిసిల్లకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడికి కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధురాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని ద్విచక్రవాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు..పెద్దూరు గ్రామానికి చెందిన జి. ఎల్లవ్వ(65) ఒంటరిగా జీవిస్తోంది. సర్ధాపూర్‌ శివారు నుంచి పెద్దూరు వైపు రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న క్రమంలో హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎల్లవ్వకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉండగా చిన్న కూతురు కొన్నినెలల క్రితం కార్గిల్‌లేక్‌లో పడి మృతిచెందింది. మారో కూతురు గంభీరావుపేటలో ఉంటోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని బుగ్గ క్రాస్‌రోడ్డు వద్ద శనివారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గోదావరిఖనికి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పీటీ స్వామి మృతిచెందారు. బసంత్‌నగర్‌ ఎస్సై శ్రీధర్‌ కథనం ప్రకారం.. స్వామి తన కారులో కరీంనగర్‌ నుంచి గోదావరిఖని వెళ్తుండగా బసంత్‌నగర్‌ స్టేజీ దాటాక అదుపుతప్పి బోల్తా పడింది. ఆయనకు తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్‌లో గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

ప్రైవేట్‌ విద్యాసంస్థల స్థాపనలో కీలకపాత్ర

గోదావరిఖని: అనేకమందికి విద్యాబోధన చేసి తీ ర్చిదిద్దిన గురువు పీటీ స్వామి(80) రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం పారిశ్రామిక ప్రాంతంలో వి షాదం నింపింది. టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌లో సీని యర్‌ నేతగా, సీనియర్‌ సిటిజన్స్‌ సంస్థ వ్యవస్థాపకుడిగా సేవలు అందించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన.. ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. కోల్‌మైన్స్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. వీర్లపల్లిలో ఈశ్వరకృప వృద్ధాశ్రమం స్థాపించి వృద్ధులకు ఆశ్రయం ఇస్తున్నారు. ఆయన మృతిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సంతాపం వ్యక్తం చేశారు.

కారు బోల్తా పడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement