పెండింగ్‌ ‘విండో’! | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ‘విండో’!

Oct 24 2026 11:53 PM | Updated on Oct 24 2026 11:53 PM

కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు

ప్రభుత్వ పరిశీలనలోనే విభజన అంశం

ఏళ్లుగా నెరవేరని రైతుల ఆశలు

సిరిసిల్ల: జిల్లాలో 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌లు) ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం కొన్ని సంఘాలకు నామినేటెడ్‌ పాలకవర్గాలను నియమించింది. సహకార సంఘాలకు సంబంధించిన విభజన అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 2005లో విభజన, సర్దుబాట్లు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత వీటి గురించి ఆలోచించడం లేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో రైతులకు పీఏసీఎస్‌ల సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. 2016లో తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని వీర్నపల్లి, రుద్రంగి, తంగళ్లపల్లి, వేములవాడ రూరల్‌ మండలాల్లో ప్రస్తుతం సింగిల్‌విండోలు లేవు. సహకార సంఘాల విభజన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

అన్నదాతలకు లభించని ‘సహకారం’

జిల్లాలోని 24 సహకార సంఘాల పరిధిలో 65,743 మంది సభ్యులు ఉన్నారు. సహకార సంఘాల పరిధి మండలం యూనిట్‌గా లేకపోవడంతో వ్యవసాయ రుణాలు రైతులకు పూర్తిస్థాయిలో లభించడం లేదు. జిల్లాలో అత్యధికంగా ఎల్లారెడ్డిపేట సహకార సంఘంలో 4,884 మంది సభ్యులు ఉండగా.. అత్యల్పంగా రుద్రంగి మండలం మానాల సింగిల్‌విండోలో 717 మంది ఉన్నారు. సంఘాల్లో సభ్యుల సంఖ్యను పెంచుకోవడంలో మిగతా పాలకవర్గాలు వెనకబడ్డాయి.

కొత్త సొసైటీలు ఏర్పాటైతే..

జిల్లాలో కొత్త సొసైటీలు ఏర్పాటైతే.. ఆయా మండలాల్లోని రైతులకు సహకార సేవలు చేరువవుతాయి. పంటల సాగు రుణాలు విరివిగా లభిస్తాయి. సహకార సంఘాల పరిధి సరిగా లేక ఎరువులు, విత్తనాలు సరిగా లభించడం లేదు. మరోవైపు వాణిజ్య బ్యాంకుల చుట్టూ తిరిగి పంట రుణాలు తీసుకుంటున్నారు.

ఇది వీర్నపల్లి మండల కేంద్రం. మండల పరిధిలో 17 గ్రామాలు ఉన్నాయి. గిరిజన తండాలతో నిండి ఉన్న ఈ మండలం ఆవిర్భవించి దశాబ్దం దాటింది. ఈ ప్రాంత రైతులు ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌ పూర్‌ సహకార సంఘం పరిధిలో సభ్యులు గా ఉన్నారు. అల్మాస్‌పూర్‌ సింగిల్‌విండో ద్వారా వీర్నపల్లి మండలంలోని రైతులకు పూర్తి స్థాయిలో వ్యవసాయ రుణాలు అందడం లేదు. ఇక్కడే సహకార సంఘం ఉంటే.. స్థానిక రైతులకు పూర్తిస్థాయిలో వ్యవసాయ రుణాలు అందేవి. ఒక్క వీర్నపల్లి మండలమే కాదు. జిల్లాలోని రుద్రంగి, తంగళ్లపల్లి, వేములవాడ రూరల్‌ మండలాల్లో సింగిల్‌విండోలు లేవు.

సింగిల్‌విండోల వారీగా సభ్యుల వివరాలు

ఎల్లారెడ్డిపేట 4,884

రుద్రంగి 717

సిరిసిల్ల 4,700

పెద్దూరు 1,143

నేరెళ్ల 2,949

ఇల్లంతకుంట 4,513

గాలిపెల్లి 1,934

ముస్తాబాద్‌ 2,613

పోత్గల్‌ 4,153

గంభీరావుపేట 3,993

కొత్తపల్లి 4,295

అల్మాస్‌పూర్‌ 2,428

తిమ్మాపూర్‌ 1,525

వేములవాడ 4,732

నాంపల్లి 1,508

రుద్రవరం 1,104

బోయినపల్లి 1,330

కోరెం 1,854

నర్సింగాపూర్‌ 1,292

మాన్వాడ 1,231

కోనరావుపేట 3,444

కొలనూర్‌ 3,133

చందుర్తి 4,194

సనుగుల 2,074

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement