కలెక్టర్ గరీమా అగ్రవాల్
మెడికల్ కళాశాలలో వైట్ కోట్ సెర్మనీ
సిరిసిల్ల: వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు డాక్టర్లుగా ఉత్తమ సేవలు అందించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైట్‌కోట్ సెర్మనీ శనివారం నిర్వహించగా.. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైద్య విద్యార్థులకు వైట్ కోట్‌లు అందజేసి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వైద్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. బాలికల, బాలుర హాస్టల్ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ నిర్వీష, తహసీల్దార్ మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
జిల్లాలో భూముల రీ సర్వే వేగవంతంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో భూముల రీ సర్వేపై అటవీ, నీటిపారుదల, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమీక్షించారు. ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు. అంతకు ముందు భూ రీసర్వే మొదటి దశను వేగవంతం చేసి, ఎంపిక చేసిన గ్రామాల్లో త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీ.ఎస్.లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.
పీఎం రాహత్ పథకం సమర్థంగా అమలు
జిల్లాలో పీఎం రాహత్ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించి, వారి ప్రాణాలు కాపాడాలని సూచించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత శాఖలు వెంటనే అప్రమత్తమవ్వాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ డీఈఈ శాంతయ్య, డాక్టర్ చీకోటి సంతోష్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పీఎం రాహత్ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
టాస్క్‌లో ఉచిత శిక్షణ
సిరిసిల్లలోని టాస్క్(తెలంగాాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్) రీజినల్ సెంటర్‌లో టెక్నికల్ కోర్సులు, బ్యాంకింగ్ బీఎస్‌ఎఫ్‌ఐలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు అర్హులని స్పష్టం చేశారు. జిల్లా గ్రంథాలయ కార్యాలయంలోని టాస్క్ రీజినల్ సెంటర్‌లోఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. వివరాలకు 95734 20718, 70755 22671లలో సంప్రదించాలని కోరారు.
సీఎమ్మార్ లక్ష్యం పూర్తి చేయాలి
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో పౌరసరఫరాల అధికారులు, రైస్‌మిల్లర్లతో సమీక్షించారు. యాసంగి 2024–2025, 2025–2026 ఖరీఫ్, యాసంగి సీజన్ సీఎమ్మార్ డెలివరీ లక్ష్యం పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీసీఎస్‌వో తనూజ, పౌరసరఫరాల డీఎం గోపాల్, పౌరసరఫరాల డీటీలు, రైస్‌మిల్లర్ల ప్రతినిధులు చేపూరి నాగరాజు, గరిపెల్లి ప్రభాకర్, పబ్బ నాగరాజు పాల్గొన్నారు.


