కాలుష్య రహిత ‘బాయిలర్‌ ఎనర్జీ’పై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

కాలుష్య రహిత ‘బాయిలర్‌ ఎనర్జీ’పై శిక్షణ

Oct 24 2026 11:53 PM | Updated on Oct 24 2026 11:53 PM

సిరిసిల్ల: కాలుష్య రహితంగా ‘బాయిలర్‌ ఎనర్జీ’ని మరింత సమర్థంగా అందించడంపై కలెక్టరేట్‌లో రెండు రోజుల శిక్షణ శనివారం ముగిసింది. హరిత పరిశ్రమల లక్ష్యంగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్‌ బాయిలర్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇంప్రూవ్‌మెంట్‌(ఈఈఐబీ) ప్రాజెక్ట్‌ సహకారంతో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇంధన సామర్థ్య స్టీమ్‌, బాయిలర్‌ వ్యవస్థలపై బాయిలర్‌ ఆపరేటర్లు, టెక్నీషియన్లు, నిర్వహణ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. తక్కువ–కార్బన్‌ ఎంఎస్‌ఎంఈల కోసం పారిశ్రామిక బాయిలర్ల రూపకల్పన, తయారీ, నిర్వహణ ద్వారా ఉష్ణశక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఎలా అనే అంశాన్ని వివరించారు. ఆవిరి ఉత్పత్తి, వినియోగంలో సామర్థ్యం, సుస్థిరత, తక్కువ ఉద్గారాలపై శిక్షణ ఇచ్చారు. అంతకుముందు తంగళ్లపల్లిలోని టెక్స్‌టైల్‌ కుటీర పరిశ్రమ, సహజ రంగుల అద్దకం(నేచురల్‌ డైయింగ్‌) టెక్స్‌టైల్‌ యూనిట్‌ను, బొట్ల ప్రాసెసింగ్‌ – సైజింగ్‌ యూనిట్‌లోని బాయిలర్‌ ఆధారిత అద్దకం పరిశ్రమను, రగుడు శివారులోని రాఘవేంద్ర రైస్‌మిల్‌ను, సిరిసిల్లలోని వాసు గౌడ బాయిలర్‌ ఆధారిత టెక్స్‌టైల్‌ పరిశ్రమలలోని స్టీమ్‌, బాయిలర్‌ వ్యవస్థలను నిపుణుల బృందం పరిశీలించింది. ఈ శిక్షణలో సీనియర్‌ బాయిలర్‌ నిపుణులు డాక్టర్‌ ఏ.కె.ఆస్థాన, ఏఎఫ్‌ఎం, ఎన్‌ఐ–ఎంఎస్‌ఎంఈ ముత్యాల శరత్‌, కన్సల్టెంట్‌, యునిడో నిరంజన్‌రావు, కోఆర్డినేటర్‌, యునిడో ఎ.అరవిందరావు, ఈడీసీ మేనేజర్‌ కె.జయంత్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ టి.వెంకటశివసాయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement