80 ఫీట్ల రోడ్డుకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

80 ఫీట్ల రోడ్డుకు మోక్షం

Oct 24 2026 11:53 PM | Updated on Oct 24 2026 11:53 PM

● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌

వేములవాడ: రాజన్న గుడి నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు చేపట్టిన 80 ఫీట్ల రోడ్డుకు మోక్షం లభించింది. పలుమార్లు ‘సాక్షి’లో ప్ర చురితమై కథనాలకు అధికారులు స్పందించా రు. శనివారం 80 ఫీట్ల రోడ్డుపై బీటీ పనులు మొదలుపెట్టారు. పనుల్లో నాణ్యత ప్రమాణా లు పాటించాలని మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు అధికారులకు సూచించారు. ఈఈ సంపత్‌, డీఈ వాణి, టీవో అన్వేశ్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌ పాల్గొన్నారు.

తెర్లుమద్దిలో డీఎస్పీ విచారణ

ముస్తాబాద్‌: మండలంలోని తెర్లుమద్దిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి శనివారం విచారణ చేపట్టారు. ఈనెల 20న తెర్లుమద్దిలో డీజే నడుస్తుండగా, ఆపమని కొమ్మెట మధు నిర్వాహకులను కో రాడు. దీనిపై ఆగ్రహించిన ఆరుగురు వ్యక్తులు మధుతోపాటు కుటుంబీకులపై దాడి చేశారు. ఈ దాడిపై బాధితులు ముస్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై జ్యోతి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గ్రామంలో ఫిర్యాదుదారుతోపాటు సాక్షులను డీఎస్పీ విచారించి వివరాలు తెలుసుకున్నారు. ఎస్సై జ్యోతి ఉన్నారు.

రీసర్వేకు సహకరించాలి

కోనరావుపేట: గ్రామాల్లో చేపడుతున్న భూ ముల రీసర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ కోరారు. కోనరావుపేట మండలం మర్తనపేటలో భూముల రీసర్వేను శనివారం అదనపు కలెక్టర్‌ పరిశీలించి, మాట్లాడారు. భూముల వివరాలను పక్కాగా సేకరించాలని, రోజువారీగా లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. ముందు ఏయే సర్వే నంబర్‌ భూముల రీసర్వే చేయనున్నారో రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేశారు.

ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

ఎల్‌నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. ఆయిల్‌పామ్‌, పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆరుతడి పంటలు సాగుచేయాలన్నారు. ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వరలక్ష్మి, ఆర్‌ఐ సంతోష్‌ పాల్గొన్నారు.

ఎన్నో విషయాలు నేర్చుకున్నాం

వేములవాడరూరల్‌: సర్పంచ్‌లకు మూడు రోజుల శిక్షణలో అధికారులు ఇచ్చిన పలు సూచనలతో ఎన్నో విషయాలను నేర్చుకున్నామని మల్లారం సర్పంచ్‌ సంగెం అర్పితరెడ్డి తెలిపారు. వేములవాడ మండలం మల్లారం సర్పంచ్‌ అర్పితరెడ్డితోపాటు జిల్లాలోని మరో ఇద్దరు సర్పంచులు హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మూడు రోజుల శిక్షణకు వెళ్లారు. అర్పితరెడ్డి మాట్లాడుతూ సర్పంచులు తెలుసుకోవాల్సిన విషయాలు, బాధ్యతలు, మహిళల నాయకత్వం, సమాచార హక్కు, గ్రామ పంచాయతీ స్థాయిలో సామాజిక సమస్యలు పరిష్కరించడం వంటి విషయాలు తెలుసుకున్నట్లు వివరించారు.

ఇప్పటికీ కాలినడకే..!

వేములవాడరూరల్‌: మండలంలోని బొల్లారం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు కాలినడకన కిలో మీటర్‌ నడిచి వెళ్తున్నారు. బొల్లారం గ్రామస్తులు బస్సు ఎక్కాలంటే కిలోమీటర్‌ దూరంలో ఉన్న హన్మాజీపేటకు నడిచివెళ్లాల్సిందే. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు వేయాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement