మృత్యుదారులు..చితికిన బతుకులు! | - | Sakshi
Sakshi News home page

మృత్యుదారులు..చితికిన బతుకులు!

Oct 24 2026 11:53 PM | Updated on Oct 24 2026 11:53 PM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి

వీకెండ్‌ శనివారం విషాదమైంది. ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతా ల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందా రు. పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన యువకులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని కారులో వస్తుండగా హుజూరాబాద్‌ పరిధిలోని రంగాపూర్‌ శివారులో లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్న ఇద్దరు సోదరుల బైక్‌కు కరీంనగర్‌లో కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సిరిసిల్లలోని రెండో బైపాస్‌లో బైక్‌ అదుపుతప్పి వ్యక్తి చనిపోయాడు. సర్ధాపూర్‌ శివారులో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద కారు ఢీకొని ఒకరు మృతిచెందగా.. మెట్‌పల్లి పట్టణం కొత్త బస్టాండ్‌ వద్ద బైక్‌ ఢీకొనడంతో మహిళ ప్రాణాలు విడిచింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బుగ్గ క్రాస్‌రోడ్డు వద్ద కారు అదుపుతప్పి గోదావరిఖనికి చెందిన వ్యక్తి చనిపోయాడు. – వివరాలు IIలోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement