కార్మికులకు అండ | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు అండ

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

ఉద్యమాలు, ఉత్పత్తిలోనూ సింగరేణి కార్మికులే మొనగాళ్లు

తెలంగాణ సాధనలో శ్రామికుల పోరాటం మరువలేనిది

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు

సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభ విజయవంతం

గులాబీ జెండానే..

సాక్షి పెద్దపల్లి/గోదావరిఖని:

బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా, ఉద్యమా ల్లోనూ సింగరేణి కార్మికులే మొనగాళ్లని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభివర్ణించారు. ప్రా ణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే సింగరేణి కార్మికులు, జీతాలు, బోనస్‌ల కోసం కాకుండా తెలంగాణ సాధన కోసం ముందుండి ప్రజా ఉద్యమాలు విజయవంతం చేయడంలోనూ సత్తాచాటారని ప్రశంసించారు. గోదావరి ప్రాంత ప్రజలు, సింగరేణి కార్మికులు ఉద్యమంలో చూపిన ఐక్యత, పోరాట పటిమ స్వరాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచాయని వివరించారు. కేసీఆర్‌ నాయకత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాయన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలు కొనసాగిస్తే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హె చ్చరించారు. వాటాలు, బేరాలు కుదరకపోవడంతోనే నైనీ బొగ్గు బ్లాక్‌ టెండర్లు రద్దయ్యాయని ఆరోపించారు.

సకలజనుల సమ్మెలో కీలకపాత్ర

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్‌ నాయకత్వంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని కేటీఆర్‌ గుర్తుచేశారు. సకలజనుల సమ్మె సందర్భంగా ఒకసారి 35 రోజులు, మరోసారి ఏడురోజులు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయేలా సమ్మెలో పాల్గొన్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమానికి పిలుపునిచ్చిన ప్రతీసారి సింగరేణి కార్మికలోకం అండగా నిలిచిందని, తెలంగాణ జెండాను ఎగురవేసి రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో కార్మికులు ముందుండి నడిచారన్నారు. కేసీఆర్‌ ఆమరణ దీక్ష సమయంలోనూ కార్మికులు ఏడు రోజులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు.

గోదావరిఖని బిడ్డ.. మస్తు తీసిండు..

శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్‌’ సినిమాలో కేసీఆర్‌ పాత్రను అద్భుతంగా చూపించారని ప్రశంసించారు. అణచివేతకు గురైన జాతి ఎలా తిరగబడుతుంది, ఆ పోరాటానికి నాయకత్వం వహించే నేత ఎలా ప్రజలను ఏకం చేసి విజయాన్ని సాధిస్తారు? అనే అంశాలను గోదావరిఖని బిడ్డ శ్రీకాంత్‌ ఓదెల చాలా చక్కగా చిత్రీకరించారని ప్రశంసల వర్షం కురిపించారు. బహిరంగసభలో నాయకులు జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, గండ్ర సత్యనారాయణ, కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య, మధుసూదనాచారి, కౌశిక హరి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, జాన్సన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement