బతుకమ్మ వేడుకలకు రండి | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ వేడుకలకు రండి

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

వేములవాడరూరల్‌: వేములవాడలో ఏడు రోజుల్లో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరుకావాలని కలెక్టర్‌, ఎస్పీలను వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, కౌన్సిలర్లు ఆహ్వానించారు. వేములవాడలో శుక్రవారం మూలవాగు బతుకమ్మ తెప్ప వద్ద నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు రావాల్సిందిగా కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే, అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌లకు ఆహ్వానం అందించారు. కమిషనర్‌ లోకేష్‌, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్‌, కొక్కుల బాలకృష్ణ, ఏల శ్రీనివాస్‌, తోట రాజు, కొండ రాజశేఖర్‌, సంతోష, రామతీర్థపు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

రాణిప్రసాద్‌కు బాలసాహిత్య పురస్కారం

సిరిసిల్లటౌన్‌: ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్‌ కందేపి రాణిప్రసాద్‌కు మరో విశిష్ట పురస్కారం వరించింది. బుధవారం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సింహప్రసాద్‌ సాహిత్య సమితి నిర్వహణలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో డాక్టర్‌ వేదగిరి రాంబాబు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ‘మా కథలు 2025’ సహా పలు విశిష్ట పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలు సాహితీప్రియులను ఆకట్టుకున్నాయి. 2026 సంవత్సరానికి గాను డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌కు డాక్టర్‌ వేదగిరి రాంబాబు బాలసాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. అనంతరం ‘మా కథలు 2025’ గ్రంథంతోపాటు సింహప్రసాద్‌ 8 బహుమతి నాటికలు, ప్రముఖ కవి, విమర్శకులు సలీం రచించిన ‘సలీం బహుమతి కథలు’ పుస్తకాలు ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారులు డాక్టర్‌ కేవీ రమణాచారి, ప్రముఖ సాహిత్యవేత్త శ్రీ విహరి, కథా రచయిత రామా చంద్రమౌళి, ప్రముఖ చిత్రకారుడు సుధామ, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సంపాదకులు పత్తిపాక మోహన్‌, ప్రముఖ నటుడు డి. రామ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ నాయకులకు నోటీసులు

తంగళ్లపల్లి: గత అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని నిరసిస్తూ తంగళ్లపల్లి బ్రిడ్జి వద్ద చేపట్టిన ధర్నాకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీచేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలి పారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నోటీసులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. నోటీసులు తీసుకున్న వారిలో గజభీంకార్‌ రాజన్న, కోడి అంతయ్య, బండి దేవదాస్‌, సిలివేరి చిరంజీవి, మోతె మహేశ్‌ యాదవ్‌, మీసాల కృష్ణ, ఆసాని శ్రీకాంత్‌ రెడ్డి, సురభి నవీన్‌ రావు, నవీన్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement