సిరిసిల్ల: కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని సిరిసిల్లలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. విద్యానగర్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళి అర్పించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కె.కె.మహేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత పాల్గొన్నారు. అంతకు ముందు మార్కండేయ స్వామి జయంతి ఉత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్, ప్రతినిధులు చిమ్మని ప్రకాశ్, నాగుల శ్రీనివాస్, కోడం రవి, మాదాసు శ్రీనివాస్, కోట అనిల్, మోర తిరుపతి, రవి, గజ్జెల్లి సత్యనారాయణ, లక్ష్మీ, సుజాత, శారద పాల్గొని బాపూజీకి నివాళుల అర్పించారు.
సిరిసిల్ల: కలెక్టరేట్‌లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డీఆర్వో గొట్టె జయశ్రీ, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్ బేగం, డాక్టర్ నయీమ్ జహా పాల్గొన్నారు.
పోలీస్ ఆఫీస్‌లో..
జిల్లా పోలీస్ ఆఫీస్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటం వద్ద ఎస్పీ మహేశ్ బీ గీతే పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్‌ఎస్సై శ్రావణ్‌యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.


