● ప్రతీ కార్యకర్త శ్రమించాలి ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. స్థానిక సినారె కళామందిరంలో ఆదివారం మెప్మా రిసోర్స్ పర్సన్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు, రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆర్పీలు మహిళలతో మాట్లాడి సీఎం సభకు భారీ ఎత్తున అక్కాచెల్లెళ్లను తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలనతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, మెప్మా పీడీ ఫసహత్ అలీభేగ్ పాల్గొన్నారు.
ప్రతీ కార్యకర్త సభ సక్సెస్‌కు శ్రమించాలి
జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రతీ కార్యకర్త సీఎం సభను సక్సెస్ చేసేందుకు ఈ రెండు రోజులు శ్రమించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్‌లో పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు అధ్యక్షతన జరిగిన ముఖ్యకార్తకర్తల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ జరగనంత భారీ ఎత్తున సభను సక్సెస్ చేయాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అందరూ సమన్వయంతో సభను విజయవంతం చేయాలన్నారు. చొప్పదండి ప్రకాశ్, యెల్లె లక్ష్మీనారాయణ, రాగుల జగన్, రవీందర్, శంకర్, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


