వాతావరణం ఎండగా ఉంటుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలి వేగంగా వీచే అవకాశం ఉంది.
ఎదురుగా వస్తే ఇరుక్కునుడే..
రుద్రంగి(వేములవాడ): రుద్రంగిలో అంతర్గత రహదారులు మరీ చిన్నవిగా మారిపోతున్నాయి. ఒక కారు వెళ్తే మరో వాహనానికి దారి లేకుండా పోతుంది. సెట్‌బ్యాక్ లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి స్వామి మాట్లాడుతూ అంతర్గత రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తామన్నారు. సెట్‌బ్యాక్ లేకుండా ఎవరూ నిర్మాణాలు చేపట్టవద్దని కోరారు.


