● ఢిల్లీ, గౌహతిలో జిల్లా ఉపాధ్యాయుల పర్యటన ● ఆయా ప్రాంతాల సంస్కృతులపై అవగాహన
ఇల్లంతకుంట(మానకొండూర్): దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులు.. సంప్రదాయాలు తెలుసుకొని.. విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు ఢిల్లీ, గౌహతి పర్యటనకు వెళ్లారు. ఈనెల 8 నుంచి 22 వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవడంతోపాటు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను అక్కడి ఉపాధ్యాయులకు పరిచయం చేశారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ పీఎంశ్రీ హెచ్‌ఎం గుర్రం సందీప్‌రెడ్డి, అనంతారం స్కూల్ టీచర్ కె.హరీందర్‌రెడ్డి ఢిల్లీకి, పొత్తూరు హైస్కూల్ టీచర్ జి.మధు గౌహతికి వెళ్లారు.
ఢిల్లీలో..
నూతన విద్యా విధానం– 2020లో భాగంగా ఉపాధ్యాయులు వివిధ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారు. గుర్రం సందీప్‌రెడ్డి, హరీందర్‌రెడ్డి క్రాఫ్ట్‌స్కిల్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో ఢిల్లీలోని సీసీఆర్టీ సెంటర్‌లో శిక్షణ పొందారు. లిప్పన్ ఆర్ట్ విత్ క్లే అండ్ గ్లాస్ బాటిల్స్, మితిల ఆర్ట్ డిజైన్స్, బుక్ బైండింగ్, పేపర్ క్రాఫ్ట్ మేకింగ్ ఆఫ్ డెకరేషన్స్ నేర్చుకున్నట్లు తెలిపారు.
గౌహతిలో..
పొత్తూరు హైస్కూల్‌కు చెందిన జి.మధు గౌహతిలోని శ్రీమంట శంకరదేవ కళాక్షేత్ర సొసైటీలో రోల్ ఆఫ్ పప్పర్టి(తోలుబొమ్మల ఆట)లో శిక్షణ పొందారు. గౌహతిలోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ పంజాబరి గౌహతిలో శిక్షణకు హాజరయ్యారు. ఫింగర్ పప్పర్టి, రాడ్ పప్పర్టి, షాడో పప్పర్టిలో శిక్షణ పొందారు.


