యువత ఆలోచనలకు జాతీయ వేదిక | - | Sakshi
Sakshi News home page

యువత ఆలోచనలకు జాతీయ వేదిక

Sep 10 2026 12:09 AM | Updated on Sep 10 2026 12:09 AM

సిరిసిల్ల అర్బన్‌: వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌–2027 క్విజ్‌ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు ప్ర త్యేక చొరవ చూపాలని జిల్లా విద్యాధికారి ఎస్‌. మొండయ్య కోరారు. అందుకు సంబంధించిన పో స్టర్లను ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌–2027 యువత ఆలోచనలకు జాతీయ వేదిక కానుందన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ పరిధిలోని మై భారత్‌ విభాగం ఆధ్వర్యంలో వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ 2027 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జరిగే జా తీయ యువజనోత్సవంలో భాగంగా రూపొందించిన ఈ వేదిక ద్వారా దేశ భవిష్యత్‌, వినూత్న విధాన రూపకల్పనలో విద్యార్థులు, యువతీ, యు వకులు భాగస్వాములు కావాలని కో రారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు మై భారత్‌.జీవోవీ.ఐఎన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా కార్యక్రమ అధికారి జి.కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement