బీడీ కార్మికుల పింఛన్ కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాం. అధికారులు, ప్రభుత్వం మరోమారు ఆలోచించి బీడీ కార్మికులకు కూడా పింఛన్ అందించే విషయాన్ని ఆలోచించాలి. అర్హులందరికీ పింఛన్ మంజూరు చేయాలి.
– వంగపెల్లి తార, బీడీ కార్మికురాలు
ఎన్నికల హామీ నెరవేర్చాలి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అన్ని రకాల పింఛన్లకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తామ ని హామీ ఇచ్చారు. అవి ఇవ్వకపోగా కొందరి నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రస్తుత దరఖాస్తుల్లో బీడీ కార్మికులకు, వృద్ధులకు సై తం అవకాశం ఇవ్వాలి.
– ఎల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు


