నేను రాసిన రాచబాట శతకం పుస్తకాన్ని పాఠశాలలో ఆవిష్కరించాను. అప్పుడే శతకం గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించాను. విద్యార్థుల్లో ఆటవెలది పద్య రచనకు, శతక రచనకు పునాది పడింది. మా విద్యార్థుల రచనలు అందరి మన్ననలు పొందుతున్నాయి. చదువుకునే స్థాయిలో విద్యార్థులు పద్యాలు, శతకాలు రాసే స్థాయికి ఎదుగడం గర్వంగా ఉంది. – కాల్వ రాజయ్య,
తెలుగు భాషోపాధ్యాయుడు, లింగన్నపేట
మా తెలుగు టీచర్ రాజయ్య సార్ ప్రోత్సాహంతోనే శతకం రాయడానికి పూనుకున్నాను. పద్యాలు అంటే ఏమిటో తెలియని నేను శతకం రాస్తానని అనుకోలేదు. సాహిత్యం గురించి అవగాహన లేని సమయంలో మా సార్ నాకు అర్థం చేయించారు. బ్లాక్‌బో ర్డుపై పద్యాలు రాసి వాటి నియమాలను వివరిస్తూ మమ్మల్ని ప్రయత్నించమని ప్రొత్సహించారు.
– పర్శకుర్మ రిషిక, కృషి శతక బాలకవి


