సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి

Aug 22 2026 2:17 AM | Updated on Aug 22 2026 2:17 AM

● తప్పులు దొర్లితే ఎవరినీ ఉపేక్షించేది లేదు ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

● తప్పులు దొర్లితే ఎవరినీ ఉపేక్షించేది లేదు ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

జగిత్యాల: రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని, తప్పులు దొర్లితే ఎవరినీ ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, భూ రీసర్వే అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించిందని, చిన్న సమస్య కూడా లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ మొదటి దశలో ఎల్‌–3 సమస్యలను పరిష్కరించి అర్హులను ఎల్‌–1 జాబితాలోకి తీసుకువచ్చి ఇల్లు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇంటి బిల్లులు త్వరలోనే చెల్లిస్తామన్నారు. 250 చదరపు అడుగుల స్లాబ్‌ విస్తీర్ణత పరిమితి పెట్టడం వల్ల నిజమైన పేదలకు ప్రయోజనం అందించడం జరుగుతుందన్నారు.

అవినీతికి తావు లేదు

రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవినీతికి అవకాశం ఉండబోదని మంత్రి అన్నా రు. క్షేత్రస్థాయి పర్యటనలో సర్వే చేసేందుకు రూ.ల క్ష అడుగుతున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే రా యికల్‌ తహసీల్దార్‌కు మెమో జారీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ సస్పెండ్‌కు ఆదేశించారు.

పాస్‌బుక్‌ల జారీలో ఆలస్యం

వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత పాస్‌బుక్‌ల జారీలో జాప్యమవుతోంద ని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. పేదలకు అసైన్డ్‌ భూములు అందించాలన్నారు.

నకిలీ పాస్‌బుక్‌లపై చర్యలు

నకిలీ పట్టాదారు పాస్‌బుక్‌లను గుర్తించి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సీ రమణ అన్నారు. నకిలీ పాస్‌బుక్‌ల ద్వారా పొందిన రైతుబంధు మొత్తాన్ని రికవరీ చేయాలన్నారు.

స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేయాలి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఉత్తర తెలంగాణలో ఒక స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాలలో ఏర్పాటు చేసేలా చూడాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కోరారు.

జనన ధ్రువపత్రాల జారీలో జాప్యం

జనన ధ్రువపత్రాల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌ అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అధి కారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement