రోడ్డు ప్రమాదంలో దినసరి కూలి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దినసరి కూలి మృతి

Aug 22 2026 2:17 AM | Updated on Aug 22 2026 2:17 AM

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌ శివారులోని వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ దినసరి కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన బొప్పాపూర్‌లో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన దినసరి కూలి బొమ్మనవేణి శ్రీను(56) కోరుట్లపేట నుంచి బొప్పాపూర్‌కు బైక్‌పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనదారుడు వాహనంతోపాటు పరారయ్యాడు. పరారైన వాహనం కోసం పోలీసులు, గ్రామస్తులు గాలింపు చేపట్టారు. మృతుడికి భార్య పుష్పల, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ ఇల్లందుల గీతాంజలి కోరారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌గౌడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement